వారాసిగూడ నుంచి సీతాఫల్‌మండి వరకు బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
నవపక్షం, సికింద్రాబాద్ ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. వారాసిగూడ నుంచి సీతాఫల్‌మండి వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు తీగుళ్ల రామేశ్వర్‌తో కలిసి బీఆర్‌ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు సమీనా మహ్మద్ ఖుషీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు...