చెంగిచెర్లలో క్యాండిల్ ర్యాలీ
నవపక్షం, చెంగిచెర్ల ప్రతినిధి : గాంధీనగర్ నగర్ కాలనీకి చెందిన రాఘవోని ప్రభాకర్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ గాంధీనగర్ నగర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కాలనీ ప్రెసిడెంట్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, పెద్దలు, యువకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రభాకర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రభాకర్ అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ...