అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్: ఎంపీ బలరాంనాయక్ — వెయ్యి రోజుల్లో అభివృద్ధి చేసి చూపించాం: ఎమ్మెల్యే మురళీనాయక్

నవపక్షం, మహబూబాబాద్ ప్రతినిధి :  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని, పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మానుకోట ఎంపీ బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 1000 రోజుల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అర్హులకు ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్...