పార్వతీపురంలో జనసేనాని జన్మదినోత్సవం.. హోరెత్తిన జనసేన శ్రేణులు
నవపక్షం, పార్వతీపురం ప్రతినిధి : జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 55వ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పార్వతీపురం నియోజకవర్గంలో జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ముందుగా స్థానిక కొత్తవలస సమీపంలోని దుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి మార్కెట్ రోడ్ మీదుగా మెయిన్ రోడ్‌లోని NGO హోమ్ భవనం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన...