నేషనల్ యూత్ వాలంటీర్‌గా కాడవేన రాకేష్ యాదవ్ ఎంపిక

నవపక్షం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన కాడవేన రాకేష్ యాదవ్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ యూత్ వాలంటీర్‌గా ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడికి జాతీయ స్థాయి యువజన సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసే అవకాశం లభించడం పట్ల గ్రామ ప్రజలు, యువత, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన రాకేష్ యాదవ్ జాతీయ స్థాయి సేవా కార్యక్రమాలకు...