కాటమయ్య రక్షణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలి

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి :  గీత కార్మికులు కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్లను సద్వినియోగం చేసుకుని తమ ప్రాణాలను కాపాడుకోవాలని తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గౌడ యువజన సంఘం మండల అధ్యక్షుడు కొప్పు జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కిట్ల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులు తాటి చెట్లను ఎక్కే సమయంలో ప్రమాదాల...