నవపక్షం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన కాడవేన రాకేష్ యాదవ్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ యూత్ వాలంటీర్‌గా ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడికి జాతీయ స్థాయి యువజన సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసే అవకాశం లభించడం పట్ల గ్రామ ప్రజలు, యువత, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన రాకేష్ యాదవ్ జాతీయ స్థాయి సేవా కార్యక్రమాలకు ఎంపిక కావడం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికే కాకుండా భూపాలపల్లి జిల్లా యువతకు గర్వకారణంగా నిలిచింది. సరైన సంకల్పం, కృషి, సేవాభావం ఉంటే గ్రామీణ ప్రాంత యువత కూడా జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటగలరనే నమ్మకానికి ఈ ఎంపిక నిదర్శనంగా నిలుస్తోంది. యువతే దేశ భవిష్యత్తు నేషనల్ యూత్ వాలంటీర్‌గా యువతను సామాజిక సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించడంతో పాటు వారిలో సామాజిక బాధ్యత, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, క్రమశిక్షణ వంటి విలువలను పెంపొందించే దిశగా రాకేష్ యాదవ్ కృషి చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ, సామర్థ్యం ఉన్నప్పటికీ సరైన మార్గదర్శకత్వం, అవకాశాలపై అవగాహన లేక వెనుకబడుతున్న యువతకు ప్రభుత్వ యువజన కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ శిక్షణ, సామాజిక సేవా అవకాశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. సామాజిక సేవకు ప్రాధాన్యం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సామాజిక సమస్యలపై యువతలో అవగాహన పెంచడం, ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను బలోపేతం చేయడం తన ప్రధాన లక్ష్యాల్లో భాగమని రాకేష్ యాదవ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, రక్తదానం, ఆరోగ్య అవగాహన, విద్యపై చైతన్యం, నైపుణ్యాభివృద్ధి, సామాజిక బాధ్యత వంటి అంశాలపై యువతను చైతన్యపరిచే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. యువతలో నాయకత్వాన్ని పెంపొందించడమే లక్ష్యం “యువతకు అవకాశం ఇస్తే మార్పుకు నాయకత్వం వహించగలరు. యువతలో సేవాభావాన్ని పెంచి, సమాజం కోసం పనిచేసే శక్తిగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం” అని రాకేష్ యాదవ్ తెలిపారు. తన ఎంపికను వ్యక్తిగత గుర్తింపుగా కాకుండా భూపాలపల్లి జిల్లా యువతకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. జిల్లాలోని వివిధ గ్రామాల యువతను కలుపుకుని సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తనను నేషనల్ యూత్ వాలంటీర్‌గా ఎంపిక చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు రాకేష్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువత కోసం, సమాజం కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. “యువత కోసం – సమాజం కోసం – దేశం కోసం” అనే ఆలోచనతో పనిచేస్తూ భూపాలపల్లి జిల్లా యువతకు ఆదర్శంగా నిలవడమే తన లక్ష్యమని తెలిపారు. గ్రామం నుంచి జాతీయ స్థాయికి… వెంకటేశ్వర్లపల్లి గ్రామం నుంచి ప్రారంభమైన రాకేష్ యాదవ్ ప్రయాణం నేషనల్ యూత్ వాలంటీర్‌గా జాతీయ స్థాయి సేవా కార్యక్రమాల వరకు చేరడం గ్రామీణ యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది. ఈ ఎంపికతో తన బాధ్యత మరింత పెరిగిందని, రాబోయే రోజుల్లో యువతను చైతన్యపరిచి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయించి సమాజ అభివృద్ధిలో యువశక్తిని వినియోగించేందుకు కృషి చేస్తానని రాకేష్ యాదవ్ తెలిపారు.
నవపక్షం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన కాడవేన రాకేష్ యాదవ్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ యూత్ వాలంటీర్‌గా ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడికి జాతీయ స్థాయి యువజన సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసే అవకాశం లభించడం పట్ల గ్రామ ప్రజలు, యువత, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన రాకేష్ యాదవ్ జాతీయ స్థాయి...