యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్థానిక జాగృతి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ పోషక వారోత్సవాలు ఘనంగా జరిగాయి.

  యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్థానిక జాగృతి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ పోషక వారోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రధమ ద్వితీయ తృతీయ విద్యార్థులు తాము తయారుచేసిన పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను వాటి ప్రాముఖ్యతను తెలుపుతూ స్టాళ్లు ఏర్పాటు చేసి పదార్థాలను విక్రయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సింగనబోయిన మల్లేశం,న్యూట్రిషన్ అధ్యాపకులు సాయిరాం,అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.