లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవపక్షం, హైదరాబాద్ బ్యూరో చీఫ్ : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గవర్నర్‌తో వివిధ అంశాలపై మర్యాదపూర్వకంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఇరువురు పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్తో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.