కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు సీఎం నిర్ణయం

నవపక్షం, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సిఫారసును గవర్నర్‌కు ఇప్పటికే పంపించారు. అలాగే తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా ఉన్న డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేశారు. ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియామకానికి...