పిడికిలిలో పోరాటం.. గుండెల్లో ప్రజాసేవ — యువతకు స్ఫూర్తిగా ఎదుగుతున్న కల్యాణి
నవపక్షం ప్రత్యేక కథనం: సిద్దిపేట జిల్లా గజ్వేల్ తాలూకా మార్కుక్ మండలం కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సలేంద్రి లక్ష్మి అబ్బయ్య దంపతుల రెండో కుమార్తె కల్యాణి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ యువతి, నేడు చదువుతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన పెంచుకుంటూ, యువతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న కల్యాణి, మరోవైపు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ప్రజా సమస్యలు, సామాజిక అంశాలపై తనదైన శైలిలో...