శ్రీకృష్ణుని బోధనలు స్ఫూర్తిదాయకం

నవపక్షం, వేములవాడ ప్రతినిధి : శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, హిందూ పురాణాలలో విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని విశిష్టత, ఆయన తత్వం, జీవిత పాఠాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని అన్నారు. సమాజానికి మార్గదర్శకత్వం చేసే విధంగా శ్రీకృష్ణుడు అందించిన సందేశాలు...