ఘనంగా కృష్ణాష్టమి

దమ్మపేట- నవపక్షం :-   దమ్ము పేట మండలం నాగుపల్లి గ్రామం జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉట్టి కొడుతూ వారి సంతోషాన్ని పరుచుకున్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా కృష్ణాష్టమి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్న పెద్ద తెడ  లేకుండా  అందరూ కూడా ఎంతో సంతోషంగా కృష్ణాష్టమి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బజ్జూరి  సరళ, మరియు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.