స్వర్ణముఖి బ్యారేజ్ నిర్వహణపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి: బీజేపీ కిసాన్ మోర్చా

నవపక్షం, గూడూరు ప్రతినిధి : స్వర్ణముఖి బ్యారేజ్ నిర్వహణ, గేట్ల పరిస్థితి, విద్యుత్ మరియు లైటింగ్ సదుపాయాలపై తక్షణ దృష్టి సారించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తిరుపతి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బొట్టికాయల చంద్రశేఖర్ గౌడ్ జిల్లా యంత్రాంగాన్ని కోరారు. వాకాడు ప్రాంత రైతాంగానికి సాగునీటి పరంగా ప్రాధాన్యత కలిగిన స్వర్ణముఖి బ్యారేజ్ ప్రస్తుతం సరైన నిర్వహణ లేకపోవడం వల్ల పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు స్థానికుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా బ్యారేజ్ గేట్లపై తుప్పు,...