సెప్టెంబర్ 6న బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం
నవపక్షం, హైదరాబాద్ : సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆయన అధ్యక్షతన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంయుక్త సమావేశం జరగనుంది. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలపై పార్టీ తరఫున లేవనెత్తాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరు...