జుక్కల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి, సెప్టెంబర్ 4: కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న టీజీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ డి. ఆంజనేయులు తీవ్రంగా గాయపడి బస్సులో ఇరుక్కుని మృతి చెందినట్లు సమాచారం. బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి...