ఘనంగా ముగిసిన మండల స్థాయి క్రీడోత్సవాలు
నవపక్షం, మర్రిగూడ, సెప్టెంబర్ 3: మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గత కొన్ని రోజులుగా ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల స్థాయి క్రీడోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. మర్రిగూడ మండల విద్యాశాఖాధికారి జి. శారద అధ్యక్షతన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ తదితర క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు, జట్లకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు....