ఘనంగా ముగిసిన మండల స్థాయి క్రీడోత్సవాలు

నవపక్షం, మర్రిగూడ, సెప్టెంబర్ 3: మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల స్థాయి క్రీడోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. మండల విద్యాశాఖాధికారి జి. శారద అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ తదితర పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడోత్సవాల నిర్వహణకు కుదాబక్ష్‌పల్లి పాఠశాల స్కూల్...