అంతంపేటలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి నిరసన
చౌటుప్పల్, సెప్టెంబర్ 4: గట్టుప్పల్ మండలం అంతంపేటలో డబుల్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. గ్రామంలో బస్సు సౌకర్యం, రహదారులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల సమస్యలను యువకులు, విద్యార్థులు, మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తగా, కొందరు ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఓ మహిళ తనకు ఇల్లు మంజూరైనా బిల్లు అందక నిర్మాణం పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. నిరసనల...