హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి
నవపక్షం, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్‌లో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. హకీంపేట్ చేరుకున్న ముఖ్యమంత్రి వివిధ విద్యా సంస్థల భవన సముదాయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య, వెటర్నరీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, 400 పడకల ఆసుపత్రితో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, హాస్టల్...