అంగన్‌వాడీ పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

నవపక్షం, పెద్దవంగర, ప్రతినిధి :  మహబూబాబాద్ జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె. శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు సెప్టెంబర్ 7 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత సీడీపీవో కార్యాలయంలో హాజరై ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని సూచించారు.