దమ్మపేటలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘వంటా-వార్పు’ నిరసన
దమ్మపేట, నవ పక్షం ప్రతినిధి : దమ్మపేట మండలం కేంద్రం లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీల పేరుతో అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచిస్తోందని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు మరియు నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విఫల పాలనకు నిరసనగా అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మండల పార్టీ మాజీ అధ్యక్షులు దొడ్డ రమేశ్ ఆధ్వర్యంలో...