మృగశిర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం. శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం శ్రావణ మాసం కృష్ణ పక్షము వర్ష ఋతువు నవమి సెప్టెంబర్ 05వ తేదీ.కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది.సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు,ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించడం జరిగింది.ఈరోజు 5:45 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు.ఉదయం 6 గంటలకు...