వెయ్యి రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
నవపక్షం, దేవరకద్ర ప్రతినిధి : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాల్లో నిర్వహించిన బైక్ ర్యాలీలు, సభల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ పాలనలో జరగని అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో చేపట్టిందన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, విద్యుత్, విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు తదితర రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల...