కాంగ్రెస్ హామీల అమలులో విఫలం: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవపక్షం, తొర్రూరు ప్రతినిధి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, కుటుంబాలకు భరోసా కల్పిస్తామన్న హామీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ తొర్రూరులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాలం...