పీఎం శ్రీ మోడల్ స్కూల్ మర్రిగూడలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
నవపక్షం, మర్రిగూడ, సెప్టెంబర్ 5: మర్రిగూడలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయుల పట్ల గౌరవం, కృతజ్ఞతలను చాటుతూ శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం మాట్లాడుతూ, సమాజ...