నేతన్న టీవీ అవార్డుకు నీలి ప్రకాష్

నవపక్షం, చర్ల మండల ప్రతినిధి, సెప్టెంబర్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు నీలి ప్రకాష్ మరో ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. నేతన్న టీవీ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 6న హన్మకొండలోని ఎస్‌వీఎస్ క్యాంపస్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. నీలి ప్రకాష్ గత రెండు దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తూ, పేదలు, ఆదివాసీలు, విద్యార్థులు, మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తున్నారు. 2004లో...