మానవత్వం చాటుకున్న అశ్వరావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు
నవపక్షం, అశ్వరావుపేట మున్సిపాలిటీ : అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్‌లో మృతి చెందిన ఓ అనాథ వృద్ధ మహిళకు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో దహన సంస్కారాలు నిర్వహించారు. అశ్వరావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ మిండా హరిబాబు, పమిడి లక్ష్మణరావు( మాజీ వార్డు సభ్యులు), మానేపల్లి ఏసులు దగ్గరుండి అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో అనాథ వృద్ధురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. గతంలో కరోనా...