రైతులు, సామాన్యుల భూములను హరించే 22A నిబంధనలను తక్షణమే ఎత్తివేయాలి: బీజేపీ మహా దీక్షలో యాదాద్రి భువనగిరి జిల్లా నేతల హెచ్చరిక

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామని భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22A) పేరుతో పేదలు, రైతులు, సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన "మహా దీక్ష" కు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి...