మునుగోడులో బీఆర్ఎస్ సమరభేరి

నవపక్షం,  మునుగోడు ప్రతినిధి :  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ‘వెయ్యి రోజుల దగా పాలనపై సమరభేరి’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు, చౌటుప్పల్, చండూరు కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ఇతర సబ్బండ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో...