ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

నవపక్షం , హైదరాబాద్ :  విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న మహాధర్నా, బిక్షాటన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సెరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 248 ఆల్విన్ కాలనీ డివిజన్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు కీర్తన్ రాజ్ పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 7న ఉదయం 11 గంటలకు మదీనాగూడ గాంధీ సర్కిల్ నుంచి చందానగర్ గాంధీ సర్కిల్ వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు....