తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా డా. గౌతమ్ కుమార్ ఎన్నిక

నవపక్షం, హైదరాబాద్ : తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా డా. గౌతమ్ కుమార్ ఎన్నికయ్యారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘ నాయకులు, ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డా. గౌతమ్ కుమార్ రాష్ట్ర...