ఎన్నికల హామీని నిలబెట్టుకున్న 9వ వార్డు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్
నవపక్షం, మొయినాబాద్ ప్రతినిధి : యేన్కేపల్లి అనుబంధ గ్రామమైన జివాన్ గూడ గ్రామానికి ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించేందుకు 9వ వార్డు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ గారు ముందడుగు వేశారు. ఎన్నికల సమయంలో జివాన్ గూడ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల్లోనే తన సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి హామీని నెరవేరుస్తున్నారు. చాలా కాలంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత నిధులతో సీసీ రోడ్డు...