తాతా మధు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన దమ్మపేట మండల కాంగ్రెస్

  దమ్మపేట, నవ పక్షం మండల ప్రతినిధి :    దమ్మపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కక్కిరాల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు వ్యక్తిగత...