యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు – సుమారు రూ.20 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ
నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల నిరంతర కృషితో CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన 100 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పౌరులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న CEIR వారియర్ అధికారులు ఫిర్యాదుదారుల వివరాలను...