విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పదు పతనం: రచ్చ శ్రీనివాస్ BJP

​నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : ​తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా, లక్షలాది మంది పేద విద్యార్థుల చదువులను, భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ మండిపడ్డారు.​ ప్రధాన డిమాండ్లు: ​బకాయిల చెల్లింపు: పెండింగ్‌లో ఉన్న రూ. 12,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.​సర్టిఫికెట్ల విడుదల: బకాయిలు...