బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం దుర్మార్గం

నవపక్షం, బోడుప్పల్ ప్రతినిధి:  బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి హాజరుకాకుండా పోలీసు బలగాలతో అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక, నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె అన్నారు. ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించడం ప్రజాప్రతినిధుల...