బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి – కొయ్యాడ శేఖర్

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :  చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో విజయవాడ రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్, 5వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కొయ్యడ శేఖర్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో చౌటుప్పల్ పట్టణ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిర్మాణ పనుల్లో భాగంగా జాతీయ రహదారి–65పై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో సర్వీస్...