420 హామీలపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది.. నారాయణపురంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

నవపక్షం, నారాయణపురం, సెప్టెంబర్ 7: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు...