ఫీజు రియాంబర్స్ మెంట్ స్కాలర్ షిప్ లు తక్షణమే విడుదల చేయాలి – BJYM నాంపల్లి మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్
నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : ఫీజు రియాంబర్స్ మెంట్,స్కాలర్ షిప్ విడుదల చేయాలనీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా బిజెపి నాయకులని నాంపల్లి పోలీస్ వారు తెల్లవారుజామున ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా BJYM నాంపల్లి మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ మాట్లాడుతూ ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వానిది సిగ్గుమాలిన చర్య అన్నారు.కనీసం రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ లేదా...