వినాయక ఉత్సవాలకు ముస్తాబవుతున్న తారానగర్
నవపక్షం, శేరిలింగంపల్లి ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం తారానగర్ గ్రామంలోని బతుకమ్మకుంట సమీపంలో ఈ ఏడాది తొలిసారిగా ఘనంగా విద్యావారిధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను నిర్వహించేందుకు శనివారం కర్ర పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్. రామాచారి, యం. మల్లికార్జున శర్మ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అతిథులుగా గొల్లపల్లి రాంరెడ్డి, మారం వెంకట్, హరికిషన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తారానగర్లో తొలిసారిగా వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా...