ఆర్టీఐ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలి
నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 7: చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సమాచార హక్కు చట్టం–2005 సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఆంజనేయచారి ప్రజావాణిలో ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టీఐ చట్టానికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న పాత బోర్డుల్లో అధికారుల పేర్లు, వివరాలను సవరించాలని ఆయన కోరారు. ఆర్టీఐ దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులో సమాచారం అందేలా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్ పట్టణంలోని జూనియర్...