దుబ్బాక–మునిపంపుల గ్రామాల్లో రోడ్డు గుంతలను వెంటనే పూడ్చాలి – ఆర్&బి కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో డీఈ కాళీ కుర్చీకి వినతిపత్రాలు ఇచ్చి సీపీఎం సర్పంచుల వినూత్న నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా, నవపక్షం  యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక–మునిపంపుల గ్రామాల మధ్య అస్తవ్యస్తంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు గుంతలను వెంటనే పూడ్చి, ప్రజల సమస్యను పరిష్కరించాలని మునిపంపుల, దుబ్బాక గ్రామాల సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహా డిమాండ్ చేశారు. రోడ్డు మరమ్మతుల విషయంలో పలుమార్లు సంబంధిత ఆర్&బి అధికారులను కలిసి విన్నవించినప్పటికీ అధికారులు అందుబాటులో లేకపోవడం, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం వినూత్న నిరసన చేపట్టారు.అధికారులు కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఆర్&బి డీఈ ఖాళీ...