రామన్నపేట మండలం 14వ వార్డులోని డా.అంబేడ్కర్ విగ్రహం సమీపంలో త్రాగునీరు వృధా అవుతుంది

  యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం 14వ వార్డులోని డా.అంబేడ్కర్ విగ్రహం సమీపంలో త్రాగునీరు వృధా అవుతుంది. పైప్ లైన్ డ్యామేజీ అయి నీటి లీకేజీ సమస్య ఏర్పడింది. గ్రామపంచాయతీకి తెలియజేసినా ఎవరు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. కొన్ని రోజులుగా వేల లీటర్ల నీరు వృధా అవుతున్నా ఎవరికీ పట్టడం లేదన్నారు. స్థానిక వార్డు మెంబర్, GP మరమ్మతులు చేపట్టాలని BSP మండల అధ్యక్షుడు నకిరేకంటి నరేష్ డిమాండ్ చేశారు.