హామీల అమలుకు బీఆర్ఎస్ నిరసన

పెద్దవంగర, సెప్టెంబర్ 8: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దవంగర మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలపై దాడులు, మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యవహారాన్ని ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో...