చౌటుప్పల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
నవపక్షం, చౌటుప్పల్ | సెప్టెంబర్ 8 : చౌటుప్పల్: ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత శ్రీ కేసీఆర్ గారి నివాసానికి బయలుదేరిన అంకిరెడ్డిగూడెం సర్పంచ్ సూర్వి మల్లేష్ గౌడ్‌తో పాటు చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన BRS నాయకులు ఉదారి రాకేష్, మహమ్మద్ అత్తులను పోలీసులు అడ్డుకుని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా సూర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ గారి నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చినప్పటికీ, వారిపై ముందస్తు చర్యలు తీసుకోకుండా, తమను మాత్రమే అదుపులోకి...