చౌటుప్పల్‌లో యువకుడిపై దాడి.. గుర్తుతెలియని ద్రవంతో కాలిన గాయాలు
నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి : చౌటుప్పల్‌లో 19 ఏళ్ల యువకుడిపై దాడి చేసి, యాసిడ్ లేదా ఇతర గుర్తుతెలియని ద్రవం పోసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, వలిగొండ రోడ్డుకు చెందిన షేక్ గౌస్ సెప్టెంబర్ 7న స్నేహితుడు బుడ్డా వినయ్‌తో బయటకు వెళ్లాడు. అనంతరం కొందరితో కలిసి మద్యం సేవించిన తర్వాత తనపై దాడి చేసి కొట్టారని, మార్కండేయ నగర్‌లోని గంగోత్రి నీటి శుద్ధి కేంద్రం సమీపంలో గుర్తుతెలియని ద్రవం పోశారని గౌస్...