డీసీఎం వ్యాన్ ఢీకొని యువకుడు మృతి

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ–కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై కుంకుడు చెట్టు క్రాస్‌రోడ్ వద్ద డీసీఎం వ్యాన్ బైకును ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. పట్టణానికి చెందిన గాజుల రాజేష్ కుమారుడు అభినవ్ రాజు బుల్లెట్ వాహనంపై వెళ్తుండగా డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అభినవ్ రాజును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.