అక్షరాస్యతే అభివృద్ధికి తొలి మెట్టు

నవపక్షం, హైదరాబాద్: సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీలో ఉన్న కృషి హై స్కూల్‌లో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ, సమాజంలో కుల, మత, ప్రాంత, లింగ తదితర ఎలాంటి వివక్షనైనా ఎదుర్కొనేందుకు చదువే ప్రధాన ఆయుధమని అన్నారు. విద్య ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుందని, అక్షరానికి పుట్టుకే కానీ మరణం లేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి, సమాజ...