అంతాపూర్ గ్రామంలో విషాదం – వాగ్మారే మారుతి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
నవపక్షం, మద్నూర్, సెప్టెంబర్ 8, 2026: కామారెడ్డి జిల్లా, మద్నూర్ మండలం, అంతాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వాగ్మారే మారుతి గారి అన్న కుమారుడు అనారోగ్య కారణాలతో అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మంగళవారం అంతాపూర్ గ్రామానికి స్వయంగా విచ్చేసి, వాగ్మారే మారుతి గారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మృతిచెందిన చిన్నారి ఆత్మకు...